Nalgonda : కీడొచ్చిందని ఊరంతా ఖాళీ..!
Nalgonda : కీడొచ్చిందని ఊరంతా ఖాళీ..!
వేములపల్లి, మన సాక్షి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం ఊరిలో దాదాపు పది నెలల నుండి 76 మంది చనిపోవడంతో గ్రామంలో పెద్దలు ఆచార్యవంతులు అన్ని కులాల పెద్దమనుషులు కలిసి పరిస్థితులను వివరించారు. ఊరికి కీడు వచ్చిందని జనం అంతా ఒకరోజు ఊరి వదిలి పెట్టి వెళ్ళాలి అని తెలియజేశారు. కీడు వచ్చిందని జనమంతా ఒకరోజు ఊరు వదిలిపెట్టి వెళ్లారు.
ఈ సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. ఈ మధ్యకాలంలో గ్రామంలోని ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని పూజారి దేశ గురువుని అడగగా ఆయన కీడు వచ్చిందని చెప్పడంతో మార్గం చెప్పమన్నారు. ఆయన సలహా మేరకు గ్రామస్తులంతా గురువారం ఉదయం సూర్యుడు ఉదయించే ముందుకే తెల్లవారుజాము నాలుగు గంటలకే ఊరి వదిలి శివారులోని పొలాల బాట పట్టారు. అక్కడే ఉండుకొని తిని సాయంత్రం సూర్యాస్తమరకు ఇంటికి చేరుకున్నారు
MOST READ :
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
పోలీస్ కస్టడీలో తహసిల్దార్ విచారణ.. అక్రమార్కుల్లో ఆందోళన..!










