Nalgonda : ప్రారంభోత్సవాలు తప్ప శంకుస్థాపనలు లేవు.. ఒక్క రూపాయి పని కూడా సీ ఎం నల్లగొండలో ప్రకటించలేదు..!
Nalgonda : ప్రారంభోత్సవాలు తప్ప శంకుస్థాపనలు లేవు.. ఒక్క రూపాయి పని కూడా సీ ఎం నల్లగొండలో ప్రకటించలేదు..!
మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నల్లగొండ, మన సాక్షి :
సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ కు వచ్చి కేసీఆర్
పూర్తి చేసిన పనులను ప్రారంభోత్సవాలు చేశారే తప్ప ఒక్క అభివృద్ధి పనికి కూడా శంకుస్థాపనలు చేయలేదని ఒక్క రూపాయి కూడా సొంతంగా పనులకు ప్రకటించలేదని , మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ జగదీశ్ రెడ్డి అన్నారు.
ఆదివారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా మంత్రులు కొత్త పనులకు శంకుస్థాపనలు చేసే దమ్ము లేదు కోమటిరెడ్డి ఉత్తమ్ లకి కేసీఆర్ కలల ప్రాజెక్టు, దేశంలో అతి పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ పాజెక్టు ను మనం కట్టుకున్నాం కేసీఆర్ విజన్, ముందు చూపు ఇప్పుడు అందరికి తెలుస్తుందనీ 2027 నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కి చేరుకోవాలని టార్గెట్ గా పని చేసినం అన్నారు.
కేసీఆర్ చేసిన కృషితో పట్టుదలతో యాదాద్రి ప్లాంట్ పూర్తి చేసినం అనికాంగ్రెస్ పార్టీ అంటేనే శని అని కాంగ్రెస్ హయాంలోనే ఫ్లోరైడ్ మహమ్మారి విజృభించింధని అలాంటి మహమ్మరిని కేసీఆర్ భగీరథ నిటితో రూపుమాపారన్నారు. ఈ జిల్లా మంత్రి మతిస్థిమితం లేకుండా మాట్లాడాడనీ యాదాద్రి ప్లాంట్ ను కులగొడతము అని ప్రగల్భాలు పాలికిండనీ అప్పటి ఎన్ జి టి కేస్ ల లో కోమటిరెడ్డి ప్రమేయం ఉందేమో అని అనుమానం కలుగుతుందన్నారు.
యాదాద్రి ప్లాంట్ ఓపెనింగ్ ను అడ్డుకుంటాడు అని అనుకున్న కానీ బుద్ది తెచ్చుకొని ఆ పని చేయలేదనీ కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ కు, మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనీమా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే అవి పూర్తి చేసినం అన్నారు.కేసీఆర్ వ్యవసాయ రంగం పై తీసుకున్న చర్యలతో నల్లగొండ జిల్లా అతి ఎక్కువగా లబ్ది పొందిందనీ ఇవ్వాళ రాష్ట్ర లో 30 వేల కోట్లు అన్నదాతలకు ఏగ్గొట్టారనీ విమర్శించారు.
రైతులకు 12 వెల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారనీ రేవంత్ సభలో మాట్లాడుతుంటేనే ప్రజలు సభ నుంచి వెళ్లిపోతున్నారని అప్పుడు మా కేసీఆర్ వస్తుంటే ప్రజల్లో ఉత్సాహం పెల్లుబికేదనీ రేవంత్ రెడ్డి కి ఎతులు ఎక్కువ అయ్యయి మిము ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుంటున్నాడనీ విమర్శించారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు ను కూడా మిమే ట్రయల్ రన్ చేసి నీళ్లు ఎత్తి పోసినం దాన్ని మళ్ళీ నిన్న ట్రయల్ రన్ చేసి ,నానా హంగామా చేసి మంత్రి కోమటిరెడ్డి అల్ప సంతోషి ల మాట్లాడుతున్నాడనీఇది అంత ప్రజలకు తెలుసు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు లో టిడియం మిషన్ ను కుట్ర పూరితంగా తెచ్చింది ఎవరు?,, ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ఎవరో? నేను త్వరలోనే చెప్తా వెల్లడిస్తా మూసి ప్రక్షాళన మిమే మొదలు పెట్టినం నల్లగొండ ను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అన్నారు.
వ్యవసాయం ను ఆగం చేస్తున్నారనీనల్లగొండ కు గోదావరి జలాలను తెచ్చింది కేసీఆర్ తెలిపారు.ఇవ్వాళ గోదావరి నీళ్లను బంద్ పెట్టారు కాంగ్రెస్ నాయకులన్నారు. కాళేశ్వరం తోనే రాష్ట్రంలో ధన్యం దిగుబడులు వచ్చాయి కాళేశ్వరం గొప్పతనం కాంగ్రెస్ మూర్ఖులకు అర్థం కాదన్నారు.జిల్లా ఐదేళ్లు వెనక్కి పోయింది అన్నారు.
జిల్లా మంత్రులు దద్దమ్మల్లాగా పలాయనం చిత్తగిస్తున్నారనీఅభివృద్ధి అంటే ఏంటో వీళ్లకు తెలియదనీజిల్లాను దోచుకుంటున్నారనీ మంత్రులు జేబులు నింపుకుటూన్నారనీకేసీఆర్ ప్రజల గుండెల్లో వున్నారనీ కేసీఆర్ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నారనీ చెప్పారు. రేవంత్ కి కేసీఆర్ అంటేనే వణుకు వస్తున్నదనీ,కాంగ్రెస్ మాత అనే విగ్రహంన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారనీ మిము అంగీకరించం అన్నారు. కాంగ్రెస్ మాత మాకు నచ్చలేదనీఆ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దనీ డిమాండ్ చేశారు మేము విభేదిస్తున్నాం అని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి .చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నోముల భగత్ .పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, కల్లు గీత కార్మిక సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్,మాజీ మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్,జిల్లాగ్రంధాలయ మాజీ చైర్మన్ రెగట్టే మల్లిఖార్జున రెడ్డి మాజీ ఆర్వో మాలే శరణ్యా రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కరీం పాషా, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్,
కొండూరి సత్యనారాయణ,లోడంగి గోవర్ధన్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, కనగల్, నల్గొండ, నార్కెట్ పల్లి, మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగొని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి,బైరెడ్డి కరుణాకర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ మారగోని గణేష్, కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి, మెరుగు గోపి
చెర్వు గట్టు మాజీ చైర్మన్ మేకల రాజి రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి మాజీ సర్పంచులు, కడారి కృష్ణయ్య సిరిగిరి వెంకటరెడ్డి కోట్ల జయపాల్ రెడ్డి,విద్యార్థి నాయకులు బొమ్మర బోయిన నాగార్జున, కట్ట శ్రీను, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
-
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!
-
Holiday : రేపు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..?
-
Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!









