రెచ్చగొట్టి పార్టీని చీల్చాలని చూస్తున్నారు.. రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం..!

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి పార్టీని బీఆర్ఎస్ నాయకులు చీల్చాలని చూస్తున్నారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

రెచ్చగొట్టి పార్టీని చీల్చాలని చూస్తున్నారు.. రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి పార్టీని బీఆర్ఎస్ నాయకులు చీల్చాలని చూస్తున్నారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాదని చెప్పడానికి మీరెవరు అని కడియం శ్రీహరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పదవులు ఇవ్వడం, పార్టీ పదవులు ఇవ్వడం పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. గతంలో హరీష్ రావు కూడా ఇదేవిధంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్పానని, మళ్లీ మీకు చెప్పాల్సి వస్తుందన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి హామీలు అమలు చేయలేని బీఆర్ఎస్ నేతలు రెండు నెలల కాలంలోనే హామీలు అమలు చేయలేదని గగ్గోలు పట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ALSO READ : సూర్యాపేట : కాంగ్రెస్ లో విలీనం అవుతున్న అసమతి కౌన్సిలర్..!

నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ.. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు నెరవేర్చలేదన్నారు. పది సంవత్సరాలపాటు హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతూ వచ్చారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు.

ALSO READ : నల్లగొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా కౌంటర్..!