Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజన్న సిరిసిల్ల జిల్లా

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో మూడో కన్ను..!

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో మూడో కన్ను..!

మనసాక్షి , ఇల్లంతకుంట

నేరాల నియంత్రణ, కేసుల ఛేద నలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్ మహాజన్అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను, పోలీస్ అధికారులు, సీసీ కెమెరాల దాతలు, ప్రజాప్రదినిధులతో కలసిప్రారంభించారు.

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దాతలు ఓలాద్రి సత్యనారాయణ రెడ్డి, మల్లేశం గౌడ్, గ్రామ సర్పంచ్ గోడిశెల జితేందర్ గౌడ్, ఎంపిటిసి స్వప్న కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్ యాదవ్, మహిళా సంఘ సోదరిమణులను, యువకులను ,గ్రామస్తులనుఅభినందించారు.

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపారు.

కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మిగితా గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.

ALSO READ : Ys Sharmila : సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది.. ఏం పీక్కుంటారో పీక్కోండి, వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన.. !

ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు.ఎస్పీ వెంట సిఐ సదన్ కుమార్, ఎస్ఐ సుధాకర్,పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు