Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణ

BREAKING : ఆ ముగ్గురికి భారతరత్న, వారి సేవలు మరువలేనివి.. ప్రధాని మోడీ ట్వీట్..!

BREAKING : ఆ ముగ్గురికి భారతరత్న, వారి సేవలు మరువలేనివి.. ప్రధాని మోడీ ట్వీట్..!

భారత మాజీ ప్రధానులు పివి, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

భారతదేశ భారతదేశ మాజీ ప్రధాని, రాజకీయ కోవిదుడు బహుభాషా వేత్త, ఇంతకుమించి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు భారత అత్యున్నత పౌర పురస్కారం అయినా భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది.

ఈ మేరకు నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పీవీ వివిధ హోదాలలో భారతదేశానికి సేవలు అందించిన వ్యక్తి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేశారు. భారతదేశంను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. 1991- 96 లో భారత ప్రధానిగా, 1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు పనిచేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి లో పీవీ జన్మించారు.

ALSO READ : నల్గొండ : మద్యం మత్తులో విధులకు హాజరైన ఎగ్జామినర్..?

మరిన్ని వార్తలు