TELANGANA: పంట రుణాల మాఫీకి నేడు లైన్ క్లియర్.. నిబంధనలు ఇవే..?
TELANGANA: పంట రుణాల మాఫీకి నేడు లైన్ క్లియర్.. నిబంధనలు ఇవే..?
మన సాక్షి :
ఎట్టకేలకు రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ కానున్నది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయనున్నారు. ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మంత్రి మండలి భేటీలో రుణమాఫీ పై క్లియర్ కానున్నది. ఆగస్టు 15వ తేదీ లోగా రైతుల అప్పులన్నీ మాఫీ కానున్నాయి.
రుణమాఫీ కోసం నిధుల సమీకరణ చేస్తూనే మరోవైపు అర్హులను తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే దానిపై అధికారులు ఓ కార్యచరణ కూడా సిద్ధం చేశారు. అర్హులను గుర్తించేందుకు ఓ నిర్ణయం తీసుకోవడానికి గాను ఈనెల 21వ తేదీన మంత్రిమండలి సమావేశం జరగనున్నది. 21వ తేదీన నిర్వహించే తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో ముఖ్యంగా రుణమాఫీ అంశం ఉంటుందని చెప్పవచ్చును.
రుణమాఫీ ఎవరెవరికి చేయాలి, ఏ విధంగా చేయాలని అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 15 వరకు వేచి ఉండకుండా ముందే రుణమాఫీని ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. జులై నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఇవీ నిబంధనలు :
పిఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారమే రుణమాఫీ అర్హులను తేల్చే అవకాశం ఉందని సమాచారం. పీఎం కిసాన్ సమ్మన్ పథకం ప్రజాప్రతినిధులు, ఐటి కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. అదేవిధంగా రుణమాఫీని కూడా అదేవిధంగా వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
నాలుగు విడతల్లో మాఫీ
రుణమాఫీ ప్రక్రియను నాలుగు విడతల్లో చేపట్టేందుకు మంత్రిమండలి నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. జూలైలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసే అవకాశం ఉంది. మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులవి మాఫీ చేయమన్నారు. రెండో విడతలో లక్షన్నర లోపు, అదేవిధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులవి రెండు విడుదలగా మాఫీ చేయనున్నారు. మొత్తం నాలుగు విడతల రుణమాఫీని కూడా ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ:
Nithish Kumar Reddy: జాక్ పాట్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాలో చోటు..!









