ఎన్నికల్లో సెక్టార్ అధికారుల బాధ్యతలు కీలకం..!

జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో నియమించిన సెక్టార్ అధికారుల బాధ్యతలు కీలకమని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సందర్బంగా సెక్టార్ అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాల విధివిధానాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఎన్నికల్లో సెక్టార్ అధికారుల బాధ్యతలు కీలకం..!

ఓటింగ్ యంత్రాల పై అవగాహన కలిగి ఉండాలి

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్

సూర్యాపేట, మనసాక్షి

జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో నియమించిన సెక్టార్ అధికారుల బాధ్యతలు కీలకమని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సందర్బంగా సెక్టార్ అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాల విధివిధానాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల కమిషన్ అందచేసిన హాండ్ బుక్ ఆఫ్ సెక్టార్ ఆఫీసర్స్ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాలని తెలియని సమస్యలు మాస్టర్ ట్రైనర్స్ తో నివృత్తి చేసుకోవాలని సూచించారు. తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను తరుచుగా తనిఖీలు చేసి సమస్యల పై దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాలోని హుజూర్ నగర్ నియోజక వర్గానికి 31 మంది, కోదాడ 28 మంది, సూర్యాపేట 29 మంది, తుంగతుర్తి కి 37 మంది మొత్తం 125 మంది సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు. సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన అలాగే సౌకర్యాల ఏర్పాటు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రొల్ యూనిట్లు, వివిపాట్స్ లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

ALSO READ : Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

అదేవిదంగా అన్ని కేంద్రాలలో పోలింగ్ కు ముందు రోజు ఏర్పాట్లు చేయుట , పోలింగ్ రోజున పోలింగ్ అధికారి, సిబ్బంది విధులు పూరించవలసిన పత్రాలపై అవగాహన కల్పించుట, 12డి ఫామ్ ను ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో 80 సంవత్సరాల వయసువున్న వృద్ధులకు అందచేయించాల్సిన బాధ్యతలు , పోలింగ్ రోజున ఓటింగ్ యంత్రాలు సరిగా పనిచేయక పోతే వాటి స్థానంలో రిజర్వ్ లో ఉన్న యంత్రాలను ఉన్నతాధికారుల సూచనల మేరకు తరలించుట తదితర అంశాల పై సెక్టార్ అధికారులు విధులు నిర్వహించ వలసి ఉంటుందని ముక్యంగా పోలింగ్ కేంద్రాలలో ముఖ్యులు సందర్శించినప్పుడు పి.ఓ డైరీ లో తప్పక రాయాలని సూచించారు.

అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, ఓటింగ్ యంత్రాల నిర్వహణ తీరు తదితర అంశాలపై స్టేట్ మాస్టర్ ట్రైనర్ రమేష్ తో అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో ఆర్.డి.ఓ లు సూర్యనారాయణ, వీర బ్రహ్మ చారి, జగదీశ్వర్ రెడ్డి, ట్రైనింగ్స్ నోడల్ అధికారి సాంబి రెడ్డి, సెక్టార్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కొలిక్కి రాని వామపక్షాల నియోజకవర్గాలు.. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు.. రెండో జాబితా విడుదలకు సిద్ధం..!