TRAINS | నల్గొండ, మిర్యాలగూడలో ఇకపై ఆ.. రైళ్లు ఆగనున్నాయి..!
TRAINS | నల్గొండ, మిర్యాలగూడలో ఇకపై ఆ.. రైళ్లు ఆగనున్నాయి..!
మిర్యాలగూడ, మనసాక్షి :
నల్గొండ , మిర్యాలగూడ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న రైళ్లు ఇకపై రైల్వే స్టేషన్ లో ఆగనున్నాయి. ఎంతోకాలంగా ఆ రైళ్లు ఆపాలని ప్రజా ప్రతినిధులు, ప్రజలు రైల్వే అధికారులకు విన్నవించారు. కాగా ఆ.. రైల్వేస్టేషన్ల లో రైళ్లను నిలిపేందుకు రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఆ 8 రైళ్లను మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఆపనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ల నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆ ఎనిమిది రైళ్లను ఆయా స్టేషన్ల లో ఇకపై ఆపనున్నారు.
ALSO READ :
2. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
3. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
4. Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)
మిర్యాలగూడలో ఆగే రైళ్లు :
1. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.
2. తిరుపతి నుంచి లింగంపల్లి వరకు వచ్చే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్.
3. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్.
4. నాగర్ సోల్ నుంచి నర్సాపూర్ వెళ్లే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్.
నల్గొండలో ఆగనున్న రైళ్లు :
1. నర్సాపూర్ – లింగంపల్లి ఎక్స్ ప్రెస్.
2. చెన్నై సెంట్రల్ హైదరాబాద్ వరకు నడుస్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్.
3. భువనేశ్వర్ – సికింద్రాబాద్ వరకు నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్
4. నాగర్ సో ల్ – నర్సాపూర్ ఎక్స్ ప్రెస్.
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఎప్పటినుంచి ఆగుతాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.









