మిర్యాలగూడ : అడ్డగోలుగా రోడ్డు విస్తరణ పనులు..!

కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారి పనులు అడ్డగోలుగా సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్డులో నిర్వహిస్తున్న పనులు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

మిర్యాలగూడ : అడ్డగోలుగా రోడ్డు విస్తరణ పనులు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి పనులు అడ్డగోలుగా సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్డులో నిర్వహిస్తున్న పనులు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

ఒడ్డు విస్తరణ ఏమైనాకు చేస్తున్నారో.? లేదో..? కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. పట్టణంలో కొనసాగుతున్న విస్తరణ పనులు రోడ్డు విస్తరణ చేయకుండానే డ్రైనేజీ కాలువలు నిర్మిస్తున్నారు. రోడ్డు విస్తరణ ఎంత వెడల్పు చేపడుతున్నారనే సమాచారం కూడా కనీసం మున్సిపాలిటీకి ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ALSO READ : BIG BREAKING : నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల..!

రోడ్డు విస్తరణ చేస్తున్నారా..? లేదా.వ? అనే విషయం కూడా స్థానిక వ్యాపారస్తులకు కూడా తెలియజేయడం లేదు. ఉన్న రోడ్డులోనే డ్రైనేజీకి నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకచోట ఒక విధంగా.. మరోచోట మరో విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల మిర్యాలగూడ పట్టణానికి సరఫరా అయ్యే మంచినీటి పైపులైన్ల మీదనే విద్యుత్ స్తంభాలను వేశారు. దాంతో పైప్ లైన్ లీకేజీ అయినప్పుడు మరమ్మతులు చేయడం చాలా కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి.

జిల్లా కలెక్టర్ కు వినతి :

మిర్యాలగూడ పట్టణంలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు ఇష్టాను రీతిలో సాగుతున్నాయని మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రంలో కోరారు. మంచినీటి పైపులైన్ల పైన విద్యుత్ స్తంభాలు వేయటం రోడ్డు విస్తరణ ఏ విధంగా చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా ఇష్టాను రీతిలో చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విస్తరణ పనులను పరిశీలించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు.

ALSO READ : Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 26న నల్గొండలో భారీ జాబ్ మేళా..!