Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణ

TS News : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఖాళీలు, అర్హతలు ఇవే..!

తెలంగాణలో నిరుద్యోగులైన మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పోస్టుల భర్తీకి అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది.

TS News : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఖాళీలు, అర్హతలు ఇవే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో నిరుద్యోగులైన మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పోస్టుల భర్తీకి అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో భారీగా 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 3100 అంగన్వాడి టీచర్ పోస్టులు ఉండగా, 12,882 పోస్టులు అంగన్వాడి సహాయకులు ఉన్నాయి.

ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను జారీ చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మల్టీ జోన్ -1 పరిధిలో మొత్తం 20,584 అంగన్వాడి కేంద్రాలలో 1853 టీచర్లు, 7737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్ -2 పరిధిలో 15,197 అంగన్వాడి కేంద్రాలలో 1247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి.

ఈ నియామక ప్రక్రియ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొనసాగుతోంది. మిగిలిన అన్ని జిల్లాలలో ఇదే తరహాలో స్థానిక అవసరాలకు అనుగుణంగా జిల్లాల వారిగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. వాస్తవానికి సంవత్సరం పైగానే ఖాళీలు ఉన్నప్పటికీ విధివిధానాలు రూపొందించకపోవడం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది.

ఇంటర్వ్యూ విధానం :

అంగన్వాడీ పోస్టులకు కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అంగన్వాడీ నిబంధనల ప్రకారం విద్యార్హతల్లో కీలక మార్పులు చేసింది. కచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలని నిబంధన విధించారు. సహాయకుల పోస్టుకు ఒకవేళ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు లేకుంటే పదవ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు.

అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పట్టణాలు లేదా గ్రామాలలో సంబంధిత వార్డులో కచ్చితంగా స్థానికులై ఉండాలని, ఆవాస ప్రాంతాల్లో సైతం ఆ గ్రామంకు సంబంధించిన వారే ఉండాలని నిర్ణయించారు. ఎస్టీ ఆవాస ప్రాంతంలో ఎస్టీ మహిళలకు మాత్రమే, అదేవిధంగా ఎస్సీ వాడలలో ఎస్సీలకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. వీరికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతకుగాను 70 మార్కులను కేటాయించారు. వితంతువులకు 5 శాతం, అనాధలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ముఖాముఖి పరీక్షకు 10% వెయిటేజీ ఇవ్వనున్నారు.

ALSO READ :

Gold Price : మరోసారి భారీగా తగ్గిన పసిడి ధర.. ఈరోజు తులం ఎంతటే..!

Miryalaguda : ముగిసిన చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ బహుమతులు ప్రదానం..! 

 

మరిన్ని వార్తలు