టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి

టిఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళ్ సై ఆమోదం తెలియజేశారు

టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి

హైదరాబాద్, మన సాక్షి :

టిఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళ్ సై ఆమోదం తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేసింది.

గతంలో ఉన్న చైర్మన్ తో పాటు సభ్యులంతా రాజీనామాలు చేశారు. కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకానికి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను సైతం స్వీకరించింది. కాగా చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని నియమించింది.

సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, జమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, రామ్ మోహన్ రావు నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన 36 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా సుదీర్ఘ సేవలందించారు. 2022 డిసెంబర్ 31వ తేదీన మహేందర్ రెడ్డి పదవీవిరమణ పొందారు.

ALSO READ: తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!