హైదరాబాదులో ఉద్రిక్తత, టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద బైఠాయించిన విద్యార్థి సంఘాల నేతలు
హైదరాబాదులో ఉద్రిక్తత, టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద బైఠాయించిన విద్యార్థి సంఘాల నేతలు
హైదరాబాద్, మనసాక్షి :
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయంపై ఆ కార్యాలయం వద్ద మంగళవారం బీజేవైఎం , విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ సంఘటనపై పోలీసులకు , బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈఎస్పిఎస్సి కార్యాలయం వద్ద ఆక్టోపస్ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు బీజేవైఎం కార్యకర్తలు భారీ కేడ్లను తొలగించి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. టిఎస్పిఎస్సి కార్యాలయ బోర్డును విద్యార్థి యువజన సంఘాల నాయకులు ధ్వంసం చేశారు.
దాంతో పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ టిఎస్పిఎస్సి పరీక్ష పేపర్ లీకేజీ వెనక ఎవరున్నారో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే పరీక్ష పేపర్ లీకేజీ అయిందని వారు పేర్కొన్నారు.











