ప్రాథమిక పాఠశాలల పనివేళలల మార్పు ఉత్తర్వులు ఉపసంహరించాలి : టిఎస్ యుటిఎఫ్

ప్రాథమిక పాఠశాలల పనివేళలల మార్పు ఉత్తర్వులు ఉపసంహరించాలి : టిఎస్ యుటిఎఫ్

చర్ల, మనసాక్షి:

చర్ల మండల పరిధిలోని ఉన్నత పాఠశాలలను మంగళవారం టి ఎస్ యూ టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బి మురళి మోహన్ మండలకమిటి సహకారంతో పలు పాఠశాలలను సందర్శించడం జరిగింది.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను ఉదయం 9.00 బదులు 9.30 గంటలకు ప్రారంభించటం అశాస్త్రీయమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభిప్రాయ పడుతున్నదని పని వేళలు మార్చాలంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు తదితర భాగస్వాముల (స్టేక్ హోల్డర్స్) అభిప్రాయాలను సేకరించి నిర్ణయించాల్సి ఉంది.

 

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన సందర్భంలో ఆ విధంగా చర్చించి నిర్ణయించిన ప్రస్తుత పనివేళలను ఏమాత్రం చర్చ లేకుండానే మార్పు చేయటం విచారకరం అని ఈ మార్పుల వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏమాత్రం ఉపయోగం లేదని ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపుతుందని అన్నారు.

 

ALSO READ : 

  1. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
  2. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
  3. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!

 

కనుక రాష్ట్ర విద్యా శాఖ పాఠశాలల పనివేళలల మార్పుపై అశాస్త్రీయంగా ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు బి. మురళీమోహన్ డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వి.బాలకృష్ణ, అద్యక్షులు కె. రాంబాబు,ఉపాధ్యక్షురాలు పి. రాధ, యస్.బాలకృష్ణ,యం.ఏడమ రాజు. కె. కృష్ణవేణి, కె. యాదగిరి, బి.శంకర్ ,పి వి రమణ పాల్గోన్నారు.