నల్లగొండ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గం ఎన్నిక

నల్లగొండ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గం ఎన్నిక

నల్లగొండ, ఆగస్టు 13, మన సాక్షి:

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా గౌరవాధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మారబోయిన మధుసూదన్, కోశాధికారిగా అశ్వత్ అహ్మద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని పి ఆర్ టి యు భవన్ లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

కాగా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పులిమామిడి మహేందర్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా నాగయ్య, కోశాధికారిగా కట్టా సుధాకర్ , ఎన్నికయ్యారు.దీంతోపాటు వివిధ నియోజకవర్గాల కమిటీలను ప్రకటించారు.

 

MOST READ ; 

  1. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
  2. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  3. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!

 

నల్గొండ జిల్లాఎలక్ట్రానిక్ మీడియా కమిటీ జిల్లా అధ్యక్షునిగా దోటి శ్రీనివాస్,. ప్రధాన కార్యదర్శిగా ఎస్ రాము, కోశాధికారిగా ఎన్. హరిబాబు లను ఎన్నుకున్నారు. ఈ కమిటీలను జాతీయ నాయకులు సత్యనారాయణ ఆమోదించారు.