Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండవిద్య

ఆదర్శంగా నిలిచిన ఉప్పలపహాడ్ సర్పంచ్.. ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెకు అడ్మిషన్..!

కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామ సర్పంచ్ ఏర్పుల నాగరాజు తన కుమార్తె అయిన రియా ను ఉప్పలపహాడ్ గ్రామo లో ని ప్రాథమిక పాఠశాల నందు రెండో తరగతిలో చేర్పించి, ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఆదర్శంగా నిలిచిన ఉప్పలపహాడ్ సర్పంచ్.. ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెకు అడ్మిషన్..!

కేతేపల్లి, మనసాక్షి :

కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామ సర్పంచ్ ఏర్పుల నాగరాజు తన కుమార్తె అయిన రియా ను ఉప్పలపహాడ్ గ్రామo లో ని ప్రాథమిక పాఠశాల నందు రెండో తరగతిలో చేర్పించి, ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు.

మండల విద్యాధికారి బిక్షమయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రభుత్వ బడికి నా వంతు సహకారం తప్పకుండా అందజేస్తానని, గ్రామం చిన్నదైనప్పటికీ ఇక్కడ ప్రభుత్వ బడి బలోపేతం కావాలన్న ఆకాంక్షతో తన కుమార్తెను ఈ బడిలో చేర్పించాలని అన్నారు.

గ్రామాల్లోని ప్రతి ఇంటికి తిరిగి విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరితే ప్రయోజనాలు ఏమిటి అనేది వివరించి గ్రామస్తులు ప్రభుత్వ బడిలో తమ పిల్లలను చేర్పించే విధంగా చేస్తున్నానని, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. తద్వారా గ్రామ విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు పొందేలా తీర్చిదిద్దబడతారని ఆశిస్తున్నానని అన్నారు.

మండల విద్యాధికారి బిక్షమయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ బడుల బలుపేతానికి కృషి చేయాలని ఉప్పలపాడు గ్రామఓ లో ని పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ సెక్షన్ కూడా ప్రారంభమైందని అన్నారు ఇప్పటికే ఈ సెక్షన్లో పదిమంది విద్యార్థులు చేరడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సర్పంచి నాగరాజును అభినందించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అవ్వారి వేరోనిక, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి కంచర్ల మహేందర్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు రమేష్, వనిత , సృజన, జీవిత, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు