వలిగొండ : ఊరూరా బలగం సినిమా ప్రదర్శన

ఊరూరా బలగం సినిమా ప్రదర్శన
వలిగొండ , మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో బలగం సినిమా ప్రదర్శనకి గ్రామ ప్రజలంతా అత్యధిక సంఖ్యలో హాజరైయ్యారు. తగ్గిపోతున్న బంధాలను బాంధవ్యాలను గుర్తు చేసుకొని సినిమా వీక్షించిన అంతసేపు కంటతడి పెట్టారు.
బలగం మన బలం , మర్చిపోతున్న మూలలను తెలంగాణ సంస్కృతిని కంటికి చూపించి అందరికి గుర్తుచేసిన ఈ చిత్రానికి వేల వందనాలు ప్రస్తుతం మారిపోతున్న సమాజంలో పల్లె సంస్కృతిని మాత్రమే కాదు ఆధునీకరణ పేరుతో ఎందరో ఇటువంటి గొప్ప విలువలను కూడా మర్చిపోతున్నారు .
సినిమాలో చూపించినట్లు రేండు గంటల్లో మనుషులు మారిపోతే అంతకన్నా గొప్ప ప్రపంచం ఎక్కడ ఉండదు అటువంటి ఉతేజాన్ని నింపి ఎందరో గుండెలను కదిలించినందుకు బలగం సినిమా బృందానికి ధన్యవాదాలు అలాగే ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మన ఊర్లో ప్రదర్శిస్తున్నందుకు మేఘన -నవీన్ రెడ్డి కి గ్రామ ప్రజలంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.