రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రుద్రంగి అమ్మాయి ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రుద్రంగి అమ్మాయి ఎంపిక

రుద్రంగి, (మనసాక్షి) : రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గాజే అక్షయ రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైంది . ఈనెల 27వ తేదీ నుంచి 30 వరకు వేములవాడ లో జరగనున్న స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా వాలీబాల్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైంది.

ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగం మహేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వాలీబాల్ అధ్యక్షులు వేణు కిషన్ రావు,గిన్నె లక్ష్మణ్ సీనియర్ క్రీడాకారులు గాజుల వేణు, దేవయ్య,శ్రీ కుమార్ రాందాస్ అభినందించారు.