వెంకటేశ్వర జూనియర్ కళాశాల లో వార్షికోత్సవ వేడుకలు..!

నేటి సమాజంలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని వెంకటేశ్వర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేశ గోని వెంకటయ్య గౌడ్ అన్నారు.

వెంకటేశ్వర జూనియర్ కళాశాల లో వార్షికోత్సవ వేడుకలు..!

చింతపల్లి.  మనసాక్షి :

నేటి సమాజంలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని వెంకటేశ్వర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేశ గోని వెంకటయ్య గౌడ్ అన్నారు.

మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ లో గల ఎస్ వి ఎస్ ఫంక్షన్ హాల్ లో ఆ కళాశాల విద్యార్థులు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యుత్ తోనే భవిష్యత్ బాటకు పునాది అవుతుందని వారు పేర్కొన్నారు.

నేటి సమాజంలో సైన్స్ విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతుందని అందుకు అనుసంధానంగా విద్యార్థులు నడుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు వారు సూచించారు. అదేవిధంగా ఉన్నత పదవులు, ఉద్యోగాలు పొంది సమాజంలో పేరు ప్రతిష్ట తీసుకురావాలన్నారు.

ALSO READ : నేడు మేడారం మహా జాతర తొలిఘట్టం.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం..!

అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. చెడు మార్గం వైపు ప్రయాణించకుండా సన్మార్గంలో ప్రయాణించి రాబోయే యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు పొంది ఉన్నారని, కళాశాల యాజమాన్యం అధ్యాపక బృందం నిరంతర కృషితోనే ఉత్తమ ఫలితాలు, ర్యాంకులు సాధించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా అధ్యాపక బృందానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అనంతల వెంకటయ్య, ఎస్ పర్వతాలు, కళాశాల డైరెక్టర్ అంగిరేకుల రాజు, జీ రమేష్, పి కృష్ణ, పి వెంకటయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మహిళ ఉద్యోగిని.. ఇంట్లో కట్టల కొద్ది నోట్లు, కిలోల కొద్ది బంగారం..!