కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలి

దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలి

దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్

చింతపల్లి , మనసాక్షి :

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

 

బుధవారం చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి వెంట నూతనంగా నిర్మితమై ప్రారంబింపబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని తొలి దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కావేటి శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు ఘన స్వాగతం పలికే సన్మానించారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.

 

ఈ సందర్భంగా వారు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి భక్తి భావంతో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించాలన్నారు.

 

కోరిన కోరికలు తీర్చే ఆ కలియుగ దైవమే సాక్షాత్ ఆ వైకుంఠ శ్రీమన్నారాయణ డే ఈ ప్రాంతంలో కొలువు తీరుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమని వారు పేర్కొన్నారు.

 

కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వాహకులు కావేటి శ్రీనివాసరావు దైవ భక్తితో వారి తండ్రి పకీర, యాదమ్మ దంపతుల కోరిక మేరకు ఈ సువిశాలమైన ప్రాంతంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం హర్షించదగ్గ విషయం అన్నారు.

 

ఈ హరిహర క్షేత్ర దేవాలయం దేవరకొండ నియోజకవర్గం లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మితం చేయబడిన దేవాలయం ఇదే మొట్టమొదటిది అన్నారు.

 

ఈ మహా పుణ్యక్షేత్రం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వామి వారికి నిత్య పూజలు అందించి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలన్నారు.

 

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డి. చంద్రశేఖర్ రెడ్డి కురుమేడు సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి ఆర్ ఎన్ ప్రసాద్ మాడుగుల వైస్ ఎంపీపీ, కుంభం శ్రీశైలం గౌడ్, గంటల ఆంజనేయులు, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు