మిర్యాలగూడ : వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

మిర్యాలగూడ పట్టణంలోని పెద్ద బజార్ లో ని శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో 31వ వార్షిక శ్రీవారి కల్యాణ మహోత్సవం ఆదివారం కుండల బజార్ లోని శ్రీ మార్కొండయ్య ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

మిర్యాలగూడ : వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

మిర్యాలగూడ , మనసాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని పెద్ద బజార్ లో ని శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో 31వ వార్షిక శ్రీవారి కల్యాణ మహోత్సవం ఆదివారం కుండల బజార్ లోని శ్రీ మార్కొండయ్య ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర మార్గశిర శుద్ధ పంచమి ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామీల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులు చీదెళ్ళ బ్రహ్మం పర్యవేక్షణ లో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్నాటి రమేష్, పట్టణ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రముఖ మిల్లర్, శివాలయం, గీతా మందిర్ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్యలు పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవానికి అన్న ప్రసాద వితరణ శ్రీ ఎస్విటి ఇండస్ట్రీస్ యజమాని ఎస్ వెంకటేశ్వర్లు సహకారంతో, ప్రసాద వినియోగాన్ని గుడిపాటి నవీన్ కుమార్, పద్మాకర్ ల సహకారంతో ఏర్పాటు చేశారు.

ALSO READ : మిర్యాలగూడ : 26వ తేదీ వరకు కార్యక్రమాలకు ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ దూరం..!