మిర్యాలగూడ : విజేతలో జాబ్ మేళాకు భారీ స్పందన

మిర్యాలగూడ : విజేతలో జాబ్ మేళాకు భారీ స్పందన
మిర్యాలగూడ , మనసాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని విజేత డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది.
యువత ఉపాధి అవకాశాలకు ఊతమిస్తున్న విజేత డిగ్రీ& పీజీ కళాశాల, పట్టణం లోని విజేత డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు, భరోసానిచ్చేందుకు జిల్లా ఉపాధి కల్పన అధికారులు, ఎం ఎస్ ఎన్ ల్యాబ్, పేటియం, ఎస్బిఐ లైఫ్, వెస్టేజ్ ల ఆధ్వర్యంలో సంయుక్తంగా జాబ్ మేళా జరిగినది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ మాట్లాడుతూ కళాశాలలు అంటే కేవలం చదువు అందించడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేలా తమ కళాశాల పనితీరు ఉంటుందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేందుకు స్ధానికంగా ఉన్న పరిశ్రమలు, ఇతరత్రా రంగాల్లో తగిన అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
తమ కళాశాలలో ఉద్యోగ ఎంపిక కు కావలసిన శిక్షణ నిచ్చి అందులో నియామకాలు అయ్యే విధంగా తీర్చిదిద్దుతాము. అందుకే అన్ని రకాల సంస్థ లు తమ కళాశాలలోనే ఉద్యోగ మేళా నిర్వహించి నిపుణులైన , తమ సంస్థ సామర్థ్యాన్ని పెంచే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని అన్నారు.
ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాలో 200 పైచిలుకు అభ్యర్థులు పాల్గొన్నారని అతి త్వరలోనే వారిని పరీక్షించి నియమాక పత్రాలు అందజేస్తారని, చుట్టూ పక్కల ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాము, కళాశాల ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ, పారా మెడికల్ ప్రిన్సిపాల్ బాలక్రిష్ణ, కళాశాల అధ్యాపక బృందం, ఉపాధి కల్పన అధికారులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.