Nalgonda : ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి..!

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు, నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ జలాశధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కకళాశాల ప్రిన్సిపల్ డా. గన్ శ్యామ్ సూచించారు.

Nalgonda : ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి..!

ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు

నల్లగొండ, మనసాక్షి,

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు, నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ జలాశధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కకళాశాల ప్రిన్సిపల్ డా. గన్ శ్యామ్ సూచించారు.

సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండలోనీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు మహిళలు, విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా
డా. కేశవులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంఐన భారతదేశంలో కులం, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందనీ చెప్పారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. పలాన వారికి వేయాలనో, ప్రలోబలకు లోంగో, ఎవరో చెప్పారని మీరు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థి, నచ్చిన నాయకుడికి ఓటు వేసి దేశ ప్రగతికి బాటలు వేయాలన్నారు. అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాల నిరోధానికి ప్రభుత్వ యంత్రాంగం తన వంతు ప్రయత్నం చేస్తున్నదని, పౌరులుగా మన బాధ్యతలు నిర్యహించి సక్రమ ఓటింగ్ కు, నైతిక ఓటింగ్ కు కృషిచేయాలన్నారు.

ALSO READ : KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

అక్రమాల నిరోధం కోసం ఎన్నికల కమిషన్ తెచ్చిన సీ- విజిల్ అప్ డౌన్ లోడ్ చేసుకుని అక్రమాలపై మనం ఉన్న చోటు నుంచే పిర్యాదులు చేయవచ్చని వివరించారు. ఈ సందర్భంగా సీ-విజిల్ ఆప్ వినియోగం, పనితీరు పై వివరించారు.
ఎన్నికల సంఘం ఈ ఎన్నికలలో 85 సంవత్సరాలు నిండిన ఓటర్లకు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని చెప్పారు.

హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్- 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పారదర్శకమైన ఎన్నికల కోసం యువత ముందుండాలని, ఈ ఎన్నికలలో వంద శాతం ఓటు వేద్దాం – దేశ ప్రగతికి బాట వేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అడ్వకేట్ కన్నెబోయిన ఉషారాణి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, దేవవాణి, యాదగిరి, రాజారాం, జ్యోతి,

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది. యాదగిరిరెడ్డి , మల్లేశం, వెంకటరెడ్డి, దుర్గ ప్రసాద్. వేణు , సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ తుటిపల్లి అంజి. చింతపల్లి వెంకన్న, జె. హరిప్రసాద్. పి. శంకర్. రాంబాబు. అర్జున్ రాజేందర ప్రసాద్. సయ్యద్ అజమత్. స్కౌట్ నిర్వాహకులు నరహరి, విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : The Wrath of Journalists : ఐఎంఏ ప్రకటనపై జర్నలిస్టుల ఆగ్రహం..!