The Wrath of Journalists : ఐఎంఏ ప్రకటనపై జర్నలిస్టుల ఆగ్రహం..!

సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని,అలాంటి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడం తగదని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు.

The Wrath of Journalists : ఐఎంఏ ప్రకటనపై జర్నలిస్టుల ఆగ్రహం..!

సూర్యాపేట కలెక్టరెట్ ముందు ధర్నా

సూర్యాపేట, మనసాక్షి:

సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని,అలాంటి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడం తగదని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టులను కించపరిచేలా (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సోషల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణం లోని వాణిజ్య భవన్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మధుబాబు హాస్పిటల్ పై తనిఖీలు నిర్వహించగా తమ బాధ్యతగా ఆయా పత్రికలు, టీవీ చానల్స్ వార్తను కవర్ చేశాయని, మరుసటి రోజు ఐఎంఏ పేరుతో సోషల్ మీడియాలో మీడియాను నల్ల గొర్రెలతో పోల్చడంతో పాటు మీడియా పై తస్మాత్ జాగ్రత్త అంటూ బెదిరింపు ధోరణితో ప్రకటన వెలువరించడం ఎంత
వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులను, వారి వృత్తిని ఎద్దేవా చేస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

 

ALSO READ : Telangabna : పార్లమెంట్ ఎన్నికలకు కెసిఆర్ కుటుంబం దూరం.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

 

కొందరు డాక్టర్లు ధనార్జనే ద్వేయంగా పెట్టుకొని పేద ప్రజల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారని ఆరోపించారు. అలాంటి హాస్పిటల్ లపై పరిశోధనాత్మక వార్తలు రాస్తుంటే రాసే వారిపై నల్ల గొర్రెలతో పోల్చి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, డాక్టర్లు విలేకరులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

 

అక్రమ సంపాదనే ద్వేయంగా పనిచేస్తున్న కొందరు డాక్టర్లు కావాలనే జర్నలిస్టులను బెదిరించాలనే ధోరణితో, ఐఎంఏ పేరుతో ప్రకటనలు చేయడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. నల్ల గొర్రెలుగా పోల్చిన ఈ జర్నలిస్టులే నల్ల సంపాదనను నల్ల రేసు కుక్కల వల్లే పసిగట్టి పరిశోధనాత్మక వార్తలు రాసి మీ అక్రమాల బండారాన్ని, బాగోతాన్ని ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. కొందరు వైద్యులు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం అక్రమ సంపాదన ధ్యేయంగా పెట్టుకొని పేద ప్రజల నుండి నానా రకాలుగా ఫీజులు, టెస్టుల రూపంలో దండుకుంటున్నారని అన్నారు.

 

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

 

ఇలాంటి వార్తలను ప్రచురించిన వార్తాపత్రికలపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న డాక్టర్లపై జిల్లా కలెక్టర్, వైద్య అధికారుల బృందం తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న హాస్పిటల్ లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పలు ప్రవేట్ హాస్పిటల్ పై కార్య చరణ త్వరలో ఉంటుందని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమం లో ఐక్య క్యాలచరణ కమిటి నాయకులు చలసాని శ్రీనివాసరావు, వజ్జె వీరయ్య యాదవ్, ఐతగాని రాంబాబు గౌడ్, డాక్టర్ బంటు కృష్ణ,నాయిని శ్రీనివాసరావు, కందుకూరి యాదగిరి, చల్లా చంద్రశేఖర్, బుక్క రాంబాబు, గునగంటి సురేష్, యల్క సైదులు, ఊట్కూరి రవీందర్, రాపర్తి మహేష్, బందు శ్రీధర్, రూపా శ్రీనివాస్, సైదిరెడ్డి, ప్రవీణ్,శ్యామ్, రవి, మల్లికార్జున్, శిగ సురేష్ గౌడ్, ఫణి, నాగేందర్, యాకయ్య, సైదులు గౌడ్, మల్లేష్, రామకృష్ణ, అశోక్, సతీష్, ఉయ్యాల నరసయ్య, సుమన్, నరేష్, వెంకటేష్, చారి, రాంబాబు, శ్రావణ్, రమేష్, వెంకన్న, అజయ్, జహీర్,  పాష, బాలు, ప్రభు జర్నలిస్టుల ఐక్య కార్యచరణ సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!