Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంమహబూబాబాద్ జిల్లా

వామ్మో.. గంజాయి రవాణా.. పోలీసులే షాక్..!

వామ్మో.. గంజాయి రవాణా.. పోలీసులే షాక్..!

కురవి, మన సాక్షి:
అక్రమ గంజాయి రవాణా రోజురోజుకు పోలీసుల కళ్ళు కప్పేందుకు రవాణా ముఠా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ అక్రమ రవాణా జరిగిన తీరు చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిదిలో సిఐ శ్రీనివాస్ నాయక్ ఆదేశాలతో ఎస్ఐ భద్రునాయక్ సిబ్బంది తో కలిసి వాహన తనిఖీ చేస్తున్నారు. లింగాల రోడ్డు నుండి వస్తున్న ట్రాక్టర్ ను ఆపి తనిఖీ నిర్వహిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్, పక్కన కూర్చునవ్యక్తి పారిపోటానికి ప్రయత్నించారు.

పోలీసులు వారిని పట్టుకొని ట్రాక్టర్ తనిఖీ చేయగా ట్రాక్టర్ ట్రాలీ కిందబాగంలో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్ లో *150 గంజాయి ప్యాకెట్ లు, (300 కేజీలు- వీటి విలువ సుమారు రూ.30 లక్షలు) పట్టుబడడం జరిగింది. ఈ రవాణా చూసి పోలీసులు షాక్ తిన్నారు. ధర్మారం తండాకు చెందిన బానోతు కిరణ్ కుమార్,  భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన బాదావత్ సూర్య పోలీసులు అరెస్టు చేశారు.

వీరిని కోర్టులో హాజరు పరచగా మహబూబాబాద్ జిల్లా జడ్జి పి చంద్రశేఖర ప్రసాద్ ఇద్దరికీ 20 సంవత్సరాల కఠినకారాగార శిక్ష, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. సిఐ శ్రీనివాస్ నాయక్ ను అధికారులు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించారు.

ఇవి కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!

NALGONDA : నల్లగొండ పోలీసుల మిషన్ పరివర్తన్.. గంజాయి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడిన వారికి సరికొత్త కార్యక్రమం..! 

District collector : డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయిల్, ఇటుకల తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

మరిన్ని వార్తలు