Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

 నియోజకవర్గం అభివృద్ధి పై  శ్వేతపత్రం విడుదల చేయాలి : నందికంటి శ్రీధర్

 నియోజకవర్గం అభివృద్ధి పై  శ్వేతపత్రం విడుదల చేయాలి : నందికంటి శ్రీధర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా , మనసాక్షి :

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించి నేటికీ 29 రోజులు పూర్తిచేసుకుని నేడు ముగింపు సందర్భంగా మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజిగిరి డివిజన్ లోని కేశవ్ నగర్, భగత్ సింగ్ నగర్ లలో శనివారం గడప గడప కు వెళుతూ ప్రజలను వారియొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 

అనంతరం మల్కాజిగిరి లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడపగడపకు వెళ్ళుతూ ప్రజలతో మాట్లాడడం వలన వారియొక్క సమస్యలనుమా వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన పింఛన్లను 2000కు పెంచారు. చాలా సంతోషం కానీ ఒక ఇంటిలో ఒకరికి మాత్రమే అందిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఒక మల్కాజిగిరి డివిజన్ లోనే దాదాపు 70 మంది వరకు పెన్షన్ కార్డులు అందించారు.

 

ఇంతవరకు డబ్బులు పడలేదని గోడు వెళ్ళబుచ్చారు. ఇలాంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలి, లేదంటే ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలను పెద్దఎత్తున ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 

అభివృద్ధి చేశామని బిఆర్ఎస్ వారు చెప్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. వాజ్పేయి నగర్ రైల్వే ట్రాక్ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కేంద్ర నుండి 50% నిధులు మంజూరు అయినా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 50% నిధులు ఇవ్వాల్సి ఉంటది. నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది.

ఎమ్మెల్యే రెండు వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఎక్కడ ఆ నిధులు మంజూరు చేశారు. శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. దోమల నివారణకు చర్యలేవి, బిజెపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంట గ్యాస్ పై విధించిన అధిక రేటుని మా కాంగ్రెస్ ప్రభుత్వం భరించి 500 రూపాయలకే ప్రజలకు అందేవిధంగా చూస్తాము. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని అన్నారు.

 

బ్యారెల్ రేటు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం లేదు. డీజిల్ వలన నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు వెంకటేష్ యాదవ్, 140 డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, బీసీ సెల్ చైర్మన్ వినోద్ యాదవ్, మైనార్టీ సెల్ చైర్మన్ ఎండి అలీ, ఎస్సీ సెల్ చైర్మన్ సానాది శంకర్, ఉమేష్ సింగ్, బి కే శ్రీనివాస్, వంశీ ముదిరాజ్, కే రాములు, నర్సింగ్ రావు, రాములు గౌడ్,జేకే సాయి, అవినాష్, సుబ్బారెడ్డి, కుట్టి శ్రీను,

 

యు సాయికుమార్, ఎంపీ ఆనంద్ రావు, బాలు, మహేందర్, సాయి గౌడ్, హరీష్ ,కుమార్, బ్రహ్మ, శ్రీనివాస్, రమణ, శివశంకర్, డోలి రమేష్, సి ఎల్ యాదగిరి, పవన్, శ్రీనివాస్, పాండు, బుచ్చిబాబు, వేణు, ఉదయ బాబు, నాగేష్, రవి, చిట్టి, నరసింహ గౌడ్, హనుమంతు, ఫరీద్, స్వప్న, మాధవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు