Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పది రోజులకే పనులు షురూ.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పది రోజులకే పనులు షురూ.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పది రోజులకే పనులు షురూ అయ్యాయి. ఫిబ్రవరి 21వ తేదీన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తిచేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ కంప్లెక్స్ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట మండలం లింగంపల్లి శివారు సర్వే నెంబర్ 30 లో గల 20 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన పాఠశాల కాంప్లెక్స్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.

ఫిబ్రవరి 21న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇట్టి పాఠశాల కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారని వాటికీ సంబందించిన పనులను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇట్టి పాఠశాల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి సంబందించిన ఏర్పాట్లు త్వరితగిన మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ ఈ. ఈ.రాము, తహసీల్దార్ తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. District collector : అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా మెడికల్ ఆఫీసర్ విధులకు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ షోకాజ్..!
  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
  3. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
  4. Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!
  5. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు