Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

yadadri : యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్..!

yadadri : యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్..!

యాదాద్రి , మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించినందున ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉన్న నియోజకవర్గంలోనే మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పని చేసిన విషయాన్ని దాచి పెట్టారని, బదిలీని తప్పించుకునేందుకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

అంతేకాకుండా హైదరాబాదు నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అదనపు కలెక్టర్ ఎక్కడికి వెళ్ళకూడదని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లాలో పనిచేసిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించి వాటిని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది.

ALSO READ : BREAKING : నల్గొండలో కీచక ఉపాధ్యాయులు.. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, అరెస్టు చేసిన పోలీసులు..!

మరిన్ని వార్తలు