యూట్యూబ్ లో చూస్తూ కాన్పు చేసుకుని.. పుట్టిన బిడ్డను చంపేసింది
యూట్యూబ్ లో చూస్తూ కాన్పు చేసుకుని.. పుట్టిన బిడ్డను చంపేసింది
నాగపూర్ : మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో ఒక బాలిక దారుణానికి ఒడిగట్టింది. యూట్యూబ్ లో చూస్తూ.. ఆమె ఇంటి వద్ద సొంతంగా కాన్పు చేసుకుంది. పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది.
వివరాల ప్రకారం నాగపూర్ లోని అంబజారి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక కు సోషల్ మీడియాలో ఒక వ్యక్తితో పరిచయమైంది. అతనితో శారీరకంగా దగ్గర అయింది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పలేదు. ఈ విషయంపై తల్లి బాలికలు ప్రశ్నించగా అనారోగ్యంగా ఉందంటూ అబద్ధం చెప్పింది.
ఆపై కాన్పు ఎలా చేసుకోవచ్చు అని యూట్యూబ్ వీడియోలు చూస్తూ పూర్తిగా తెలుసుకుంది. ఈనెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో యూట్యూబ్ లో చూస్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ పసికందు గొంతునులిమి చంపేసింది. ఇంట్లోనే ఓ పెట్టెలో పసికందు మృతదేహాన్ని దాచి పెట్టింది.
పని మీద బయటకు వెళ్లిన తల్లి తిరిగి వచ్చేసరికి బాలిక అనారోగ్యంగా ఉండటానికి గమనించి గట్టిగా నిలదీసింది. దాంతో ఆ బాలిక తల్లికి జరిగిందంతా చెప్పింది. పోస్టుమార్టం నిమిత్తం పసికందు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.









