Ys Sharmila : వైఎస్ షర్మిల పర్యటన షెడ్యూల్.. రేపు బాధ్యతల స్వీకరణ..!
Ys Sharmila : వైఎస్ షర్మిల పర్యటన షెడ్యూల్.. రేపు బాధ్యతల స్వీకరణ..!
హైదరాబాద్, మన సాక్షి :
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రెండు రోజుల 20, 21 తేదీలలో పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజులపాటు ఆమె పర్యటించి ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించే ముందు తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పిస్తారు.
ఈ నెల 20 న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపుల పాయ కు బయలు దేరుతారు.సాయంత్రం 4 గంటలకు వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.
ఈ నెల 21 న కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు.
విజయవాడ లో ఉదయం 11 గంటలకు పిసిసి చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
ALSO READ: మిర్యాలగూడ : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ..!









