Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం.. 19న కోదాడలో మెగా జాబ్ మేళా..!

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం.. 19న కోదాడలో మెగా జాబ్ మేళా..!

సూర్యాపేట, మనసాక్షి :

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

మంగళవారం సూర్యాపేట లోని డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మెగా జాబ్ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ALSO READప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. భరించలేక యువతి ఆత్మహత్య..!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్నందున యువత ఈ అవకాశాన్ని వదులుకోకుండా జాబ్ మేళాలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ALSO READనిరుద్యోగ యువతకు బంగారు అవకాశం.. 19న కోదాడలో మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు