వైభవంగా శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం..!
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవాన్ని డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం..!
– అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వేములపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవాన్ని డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
అలాగే భారీ సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితులు బ్రహ్మశ్రీ వారణాసి ఉదయ భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూలతో అలంకరించిన మండపంలో తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా సాగాయి.
గ్రామ ప్రజలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.కోలాట బృందాలు, భక్తజనాలతో కళకళలాడగా, డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.ఈ సందర్భంగా మహిళలు హారతులు పట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వెంకటేశ్వర్లు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
By : Vinay goud, Journalist












