10th Result : పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, బాలికలదే పైచేయి

10th Result : పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, బాలికలదే పైచేయి

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు . అనంతరం ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల మొత్తం నాలుగు లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయగా 86.60% ఉత్తీర్ణత సాధించారు.

 

బాలురు 84.68, బాలికలు 88.53% ఉత్తీర్ణత సాధించి.. బాలికల పై చేయిగా నిలిచారు. 2793 స్కూళ్లలో నూరు శాతం ఫలితాలు వచ్చాయి. 25 పాఠశాలల్లో 0 ఫలితాలు వచ్చాయి. 99% ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ఫస్ట్ స్థానంలో నిలిచింది. 59.46%తో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచిందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.