Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

Nizamabad : 27 ఏళ్ల వసంతోత్సవం.. రక్త బంధం కన్నా ఆత్మ బంధం చాలా గొప్పది..!

Nizamabad : 27 ఏళ్ల వసంతోత్సవం.. రక్త బంధం కన్నా ఆత్మ బంధం చాలా గొప్పది..!

నిజామాబాద్ జిల్లా( భీంగల్), మన సాక్షి

భీంగల్ మండలంలోని పల్లికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (1997-1998) ఎస్.ఎస్.సి బ్యాచ్ విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో వేదిక చేసుకొని 27 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల తోసహా ఆత్మీయంగా కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు విద్యను బోధించిన ప్రధానో పాధ్యాయులు సాంబశివరావు, ఉపాధ్యాయులు మోహన్, మహికాంత్, శ్రీనివాస్,బాల్ రాజు, నర్సయ్య, జయచంద్, లకు ఘనంగా శాలువ పూలమాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ. 27 సంవత్సరాలు తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచు కోవడం సంతోషకరం అని అన్నారు. గురు శిష్య బంధం కుటుంబ బంధం కన్నా మహెున్నమైనది అన్నారు.

విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగి సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, వ్యాపారం, సామాజిక సేవ, సకల రంగాలలో సేవ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులుగా రాణించి, కష్టాల్లో ఆపద్బాం ధవులుగా నిలవాలని కాంక్షించారు. పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి బాల సంస్కృతి లో గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వరకు కలిసిమెలిసి డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సయ్యద్ కమల్ పాషా, షైక్ షకీల్, మొహమ్మద్ గౌస్, ఆర్. గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, పీవీ నర్సింగ్ రావు, రమేష్, బ్రహ్మయ్య, సతీష్, మహేమూడ్ ఔనిస్స, రేష్మ, గంగామణి, యమున, అన్నపూర్ణ, స్వప్న, సరస్వతి, శైలజ, మంజుల, రజిని, విద్యార్థినిలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

  2. Haythnagar : హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 30 కి పైగా గుడిసెలు దగ్ధం..!

  3. KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)

  4. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

  5. Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!

మరిన్ని వార్తలు