Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

రాష్ట్రాభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు

రాష్ట్రాభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు

తుంగతుర్తి,  మన సాక్షి

బంగారు తెలంగాణ నిర్మాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న రాష్ట్రాఅభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి స్వాగతించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. బడుగు బలహీనవర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ శ్రీశైలం, జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు,చెరుకు పరమేష్, వెలుగు పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మల్లెపాక రాములు, ఎస్ కే యాకూబ్, ఉప సర్పంచ్ పరమేష్, వార్డు మెంబర్ రత్నాకర్ ,మల్లెపాక ముత్తయ్య, గుడిపాటి వీరయ్య, గుడిపాటి నరసయ్య, గుడిపాటి సురేష్, పాలడుగు జలంధర్, గడ్డం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు