Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

 ఆన్ లైన్ గేమ్ ల ద్వారా మోసాలు

 ఆన్ లైన్ గేమ్ ల ద్వారా మోసాలు

విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు

చౌటుప్పల్, మన సాక్షి.

స్థానిక చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని శ్రీ గాయత్రి హైస్కూల్లో షీ టీం బృందంలోని పి. నాగలక్ష్మి, ఎండి అలీముద్దీన్ నేతృత్వంలో శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు షీ టీం పై, సైబర్ క్రైమ్ ఫై అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీం పనిచేయు విధానము, మహిళా చట్టాలు, డయల్ 100, సైబర్ మోసాలు గురించి కులాంశకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ పి.నాగలక్ష్మి విద్యార్థులతో మాట్లాడుతూ..

 

పాఠశాల, కళాశాలలో, బస్ స్టాప్ లలో ఇలా ఏ ప్రదేశంలోనైనా కానీ ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే షీ టీం హెల్ప్ లైన్ నెంబర్ 79 01099259 కు లేదా, 100కు డయల్ చేసి రక్షణ పొందాలని తెలిపారు. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాల్య వివాహాలు, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమ్ల ద్వారా జరిగే మోసాలు, చైన్స్ స్నాచర్లు గురించి, స్త్రీలపై అత్యాచారాలు, స్త్రీలను అవమానించడం వంటి అంశాలపై విద్యార్థినీలకు అవగాహన కల్పించారు.

 

ముఖ్యంగా విద్యార్థులు ఫోన్ చేసేటప్పుడు కానీ, చూసేటప్పుడు అనవసరంగా వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంచి విషయాలు తెలియజేసిన షీ టీమ్ బృందానికి పాఠశాల ఇంచార్జ్ త్రిశాలాదేవి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు