వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
వలిగొండ , మన సాక్షి:
హైదరాబాదులోని ఎమ్మెల్యే కార్యాలయంలో వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 50 మంది అంబటి వెంకటేష్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వీరికి గులాబీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాడిగళ్ల రామ నరసింహ, అంబటి యాదగిరి, పూస నరసింహ ,అంబటి రఘు, అంబటి భాగ్యలక్ష్మి ,అంబటి యాదమ్మ పూస లక్ష్మయ్య, కాడిగల పెద్ద లింగయ్య ,దీటి సత్తెమ్మ, వింజమూరు యాదయ్య, గంగాధర్ రాము ,అంబటి సత్తయ్య ,పూస రాజు ,అంబటి మురళి, దవిడబోయిన గణేష్ తదితరులు చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పులిపలుపుల అంజయ్య ,అంబటి మోహన్ ,కాడిగళ్ల లింగయ్య ,గాజుల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.









