Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

రోడ్డున పడ్డ మత్స్య కార్మికులు

పిల్లలమర్రి సహకార సంఘ ఏర్పాటుతో రోడ్డున పడ్డ మత్స్య కార్మికులు

సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ తో కలిసి ఉన్న పిల్లలమర్రిని ప్రత్యేక సొసైటీగా ఏర్పాటు చేయడం తగదని దీంతో మత్స్య కార్మికులు రోడ్డున పడ్డారని సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష, కోశాధికారి సారగండ్ల కోటయ్య, ఇండ్ల సురేష్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

 

పిల్లలమర్రి గ్రామము సూర్యాపేట మత్స్య సహకార సొసైటీలో ఉన్న గ్రామమని అన్నారు. సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పడిన నాటి నుంచి పిల్లలమర్రి గ్రామంలోని శోభసముద్రం, కేతినేని చెరువుల్లో చేపలు పట్టడం జరుగుతుందని అన్నారు. పిల్లలమర్రి గ్రామ సొసైటీని నిబంధనలకు విరుద్ధంగా సహాకార సంఘాల చట్టాన్ని ఉల్లంఘించి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

 

పారిశ్రామిక సహకార సంఘం 1952లో ఏర్పాటు అయిందని నాటి నుంచి నేటి వరకు పిల్లల మర్రి గ్రామం తమ సొసైటీ లోనే ఉందని అన్నారు. *ఇదిలా ఉంటే పిల్లలమర్రి గ్రామానికి చెందిన తూటిపల్లి మహేష్ పిల్లలమర్రి గ్రామ సొసైటీ ఏర్పాటుకు తాము ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపించడం తగదని అది నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని అన్నారు. 200 ఎకరాల విస్తీర్ణం గల పిల్లలమర్రి చెరువులో కేవలం 35 మంది మాత్రమే సభ్యులు ఉన్నారని అన్నారు.

 

రాయినిగూడెంలో 278 మంది సభ్యులు 60 ఏళ్లుగా కలసి ఉన్న చెరువులను విడదీయడం సరికాదన్నారు. ఫ్రీ విల్లేజ్ అన్నప్పుడు మాకు ఫిషింగ్ ఆర్డర్ మాకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికీ 300 మంది సభ్యత్వ ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని ప్రతి గడపకు సభ్యత్వం అందించేందుకు తాము కృషి చేస్తామని అన్నారు.

 

20 సంవత్సరాల సీనియార్టీ ఉన్న పారిశ్రామిక అధికారి రూపేందర్ సింగ్ మత్స్యకారులను రోడ్డున పడేసేలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. గతంలో ఆ చెరువులో 150 టన్నుల చేపలు పట్టగా మాకు వాటాలు ఉన్నప్పటికీ మాకు వాట ఇవ్వలేదని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

 

ఈ సమావేశంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి సందనబోయిన నాగరాజు, ఉపాధ్యక్షులు నల్ల మేకల వెంకన్న, కోశాధికారి సురేష్, డైరెక్టర్లు కోల నిరంజన్, మోర జానకిరాములు, నల్ల మేకల అంజయ్య, మారిపెద్ది ముత్తయ్య, మౌనిక, ఎల్లయ్య, లక్ష్మి, నల్ల మేకల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు