యాదవ, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – కూసుకుట్ల
యాదవ, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – కూసుకుట్ల
-ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి.
చౌటుప్పల్. మన సాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్ల గూడెం గ్రామంలో గొర్రెలపంపిణిప్రతేక్య పథకం పేస్ 2. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఫిష్ అండ్ గోట్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు యాదవ్ ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…
మందోళ్ల గూడెం గ్రామంలో రెండో పేస్ గొర్రెల విడత కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 93 కోట్ల రూపాయలను లబ్దిదారుల అకౌంట్ లో వేయడం జరిగిందని అన్నారు. గొర్రెల పెంపక దారులకు అవగాహనా సదస్సును నిర్వహించారు.ప్రతి ఒక్క లబ్ధిదారులకు 1.58000 రూపాయలు వారి అకౌంట్ లో వేయడం జరిగిందని, లబ్ధిదారులకు నచ్చిన గొర్రెల తీసుకోవాలి అని అవగాహనా సదస్సులో చెప్పారు.
యాదవ సోదరులు పరిపూష్టిగా అభివృద్ధి చెందాలని కోరారు.వేరే ఇతర రాష్టాలలో ఈ విదంగా యాదవ సోదరులకు ఇలాంటి స్కీమ్ లు లేవని, కేవలం తెలంగాణాలో మాత్రమే ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కె దక్కిందన్నారు. యాదవులు ఆర్ధికంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు, ఇలాంటి స్కీమ్ లను రాష్టంలో కేసీఆర్ ప్రవేశ పెట్టి అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని అన్నారు.పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు అందరికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
కేంద్రం ప్రభుత్వం 19 లక్షల కోట్లు ఆదాని, అంబానీలకు దోచిపెట్టడం జరిగిందని కేంద్రప్రభుత్వమును దుయ్యబట్టారు .గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అధికారులు పారాదర్శకంగా పని చేయాలి అని, తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా ఎదగాలి అని కోరారు.
ఫిష్ అండ్ గోట్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతు..
కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ పోతూ,సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు.యాదవ,కురుమ సంఘ నాయకులు ఆర్థికంగా ఎదగాలి అని రాష్ట్ర వాప్తంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దీని ద్వారా గొల్ల కురుమలు ఆర్ధికంగా లాభసాటిగా ఎధగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం యూనిట్లను త్వరలో ఇవ్వడం జరుగుతుందని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.









