Breaking NewsTOP STORIESక్రైంజాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణ, మళ్లీ 16న విచారణ
ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణ, మళ్లీ 16న విచారణ
న్యూఢిల్లీ, మన సాక్షి :
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీలో ఈడి విచారణకు హాజరైన బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ముగిసింది. తిరిగి ఈనెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కవితను మద్యం కుంభకోణం కేసులో సుమారు 8 గంటల పాటు విచారణ కొనసాగించారు.
కవిత వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేసుకున్నారు. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురుచూసిన టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. విచారణ ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈడీ విచారణ మోగించడంతో కవిత ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు బయలుదేరారు. ఆమెతోపాటు మంత్రు లు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ కూడా హైదరాబాదుకు చేరుకుంటున్నారు.









