లక్షెట్టిపేట : సాహితీ స్రవంతి నూతన కార్యవర్గం
లక్షెట్టిపేట : సాహితీ స్రవంతి నూతన కార్యవర్గం
లక్షటిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లోని స్థానిక గుడ్ షెఫర్డ్ హైస్కూల్ ఆవరణలో సోమవారం గోపగాని రవీందర్ అధ్యక్షతన సాహితీ స్రవంతి లక్షెట్టిపేట సంస్థ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ల్యాదాల గాయత్రి ,ప్రధాన కార్యదర్శిగా నూటెంకి రవీంద్ర, ప్రచార కార్యదర్శిగా రాచకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కొండు జనార్ధన్, ముత్యం మల్లేశం, ఐ. వీ. సుబ్బాయమ్మ, కార్యదర్శులుగా కల్వల సంతోష్, కోమాకుల సందీప్, లేదాళ్ళ జయ, గుర్రాల శ్రీనివాస్ కార్య నిర్వాహక కమిటీ సభ్యులుగా నూటెంకి భారతి, బిరుదుల ప్రవీణ్, వేముల వినోద్, సలిగంటి మల్లేశ్, పురం సుధాంశ్, కొట్టె వినయ్ కుమార్ తదితరులు ఎన్నికయ్యారు.
కాగా సంస్థకు గౌరవ అధ్యక్షులుగా గోపగాని రవీందర్,సలహా మండలి సభ్యులుగా ఎం. ఏ. గఫార్, కందుల తిరుపతి, వేనంక చక్రవర్తి, గుండ ప్రభాకర్, కాసం కుమార స్వామి నియమితులయ్యారు. కొండు జనార్ధన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.









