యాదాద్రి జిల్లాలో వడగళ్ల వాన
యాదాద్రి జిల్లాలో వడగళ్ల వాన
వలిగొండ , మనసాక్షి:
వలిగొండ మండల పరిది లోని పులిగిల్ల ప్రాంతంలో సాయంత్రము దంచికొట్టిన వడగండ్ల వానకు వరిచేలు టమాట ,మరియు మామిడి తోటలకు విపరీతమైన నష్టము కలిగినది .వరిచేల పొట్టదశలో ఉండటం వల్ల వడగండ్ల వానకు విచ్చిన్నమైనవి . పులిగిల్ల లో అధికంగా సాగు చేసే టమాటా పంటలకు కూరగాయల సాగులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మరికొన్నిచోట్ల మామిడి పిందా కూడ పూర్తిగా రాలిపోయినవి . అప్పుసప్పుచేసి ఆరుగాలం కష్టపడిన రైతన్న ,జరిగిన పంటనష్టము చూసి కన్నీరుమున్నీరుఐతుండు .
ఈ సారి వరిచేళ్లకు సూక్ష్మ తెగుళ్లకోసం అధికమొత్తంలో ఖర్చుపెట్టి రసాయన మందులు వాడి పంటను కాపాడుకున్న తరుణంలో
అకాల వర్షాలు అన్నదాతను కోలుకోని దెబ్బతీశాయని ఎదనిండ దుఃఖంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .సంబందిత వ్యవసాయ అధికారులు క్షేత్రసాయిలో పర్యటించి జరిగిన పంటనష్టము ఇప్పించవలసినదిగా
ప్రభుత్వవాన్ని కోరుతున్నారు .









