వలిగొండ : పాపం ఈ రైతుకు కడగండ్లు మిగిల్చిన వడగళ్లు
పాపం ఈ రైతుకు కడగండ్లు మిగిల్చిన వడగళ్లు
ఆరుగాలం పండించిన పంట వర్షం దెబ్బలకు నేలపాలు అయిపోయే
వలిగొండ , మన సాక్షి:
వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామం లో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి పంటలన్నీ దెబ్బతిన్నం జరిగింది అందువల్ల అపార నష్టం జరిగింది. కూరగాయలు అధికంగా సాగు చేసే పులిగిల్ల గ్రామంలో కూరగాయల పంటలైన టమాట, దోస, సొర ,బీర లాంటి పంటలు పూర్తిగా వడగండ్ల దాటికి నిలమట్టమైనవి. అదేవిధంగా వరిచేలు పొట్ట దశలో ఉండటం వల్ల గొలుసు అంతా కూడా రాళ్లదెబ్బలకి విరిగినట్లు అయింది. అదేవిధంగా టమాటా పింద దశలో ఉండటం వల్ల టమాటా కాయలు అన్ని నేలపాలయ్యాయి. బీరతోటలు మొత్తం బీరకాయలు పగిలిపోయినవి పెట్టిన పెట్టుబడి అంతా కూడా నేలపాలైన పంటలను చూసి నెత్తి నోరు బాదుకున్నారు.
వివరాల్లోకెళ్తే పులిగిల్ల గ్రామస్తుడైన సుంకరి శ్రీనివాస్ రెడ్డి అనే రైతును మనసాక్షి పలకరించగా తను ఒక ఎకరం టమాట, అర ఎకరం బీరా, ఒక ముప్పై గుంటల్లో దోస కూరగాయలు సాగు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన వర్షానికి పంటలన్నీ దెబ్బతిన్నాయని 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి మట్టిలో కలిసిపోయాయని మనసాక్షి ప్రతినిధితో పేర్కొన్నారు.









