Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

సిట్ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి, చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సిట్ ..?

సిట్ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి, చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సిట్ ..?

మనసాక్షి ఇంటర్నెట్

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై ఆయన గురువారం సీట్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తనను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. సిట్ కాదు… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కావాల్సిందే అన్నారు.

 


టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయిందని, ఒకటి కాదు… అరడజను ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టమైపోయిందని, రోజుకో దారుణం బట్టబయలవుతోందని ఆరోపించారు.

 

పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు.

 

తప్పును ఎత్తి చూపడమే నేరమట, ఆరోపణల గురించి ప్రస్తావించ కూడదట, అన్యాయాన్ని నిలదీయకూడదట, సమాధానం చెప్పమని పిలిచింది. వెనక్కు తగ్గేదే లేదు. సిట్ కు సమాధానం చెబుతా… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

రేవంత్ రెడ్డి ఆధారాలు ఏమి ఇవ్వలేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకున్నందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు