రక్తదానం ప్రాణదానం తో సమానం – సిఐ మల్లికార్జున్ రెడ్డి
రక్తదానం ప్రాణదానం తో సమానం – సిఐ మల్లికార్జున్ రెడ్డి
చౌటుప్పల్, మన సాక్షి.
యువత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని రక్తదానం ప్రాణదానంతో సమానమని చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆయాన్ష్ భార్గవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో 11వ వార్డులో స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో సోమవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ ఐ అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువతకు ప్రోత్సహిస్తున్న సేవా ట్రస్ట్ చైర్మన్ బోదుల మురళిని సిఐ అభినందించారు.
అలాగే ప్రతి ఒక్కరు విధిగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా వందమందికి పైగా రక్తదానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్, జబర్దస్త్ ఫేమ్ వాసు వన్స్ మోర్, వేణు, రిజ్జు, మున్న, శ్రీకాంత్ రెడ్డి ,శివ, శ్రీకాంత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.









