రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500 కే గ్యాస్ సిలిండర్
మిర్యాలగూడ, మన సాక్షి :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే గ్యాస్ అందజేస్తాని డిసిసి అధ్యక్షులు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు.
సోమవారంణహత్ సే హత్ జూడో యాత్ర లో భాగంగా నల్గొండ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బెట్ట తండా నుండి గాంగ్య తండా, బొల్లిగుట్ట తండా , వాచ్య తండా , బొత్తలపాలెం గ్రామాల మీదుగా యాత్ర కొనసాగింది . యాత్రలో యాత్రను ఉద్దేశించి శంకర్ నాయక్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, పోడుభూమి సమస్యని పరిచరిస్తామని, 500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. కవులు రైతులకు 15000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ , కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి ,బసవయ్య గౌడ్ ,లావూరి మంగుతా, లక్కీ సింగ్, రాంబాబు, ఆకారపు గోపాల్, కొమ్ము దాసు, సద్దాం, సిపాయి, రామయ్య, వసంత్, నాగరాజు, శివ నాయక్, ఆనంద్, శీను, కోటేశ్వరరావు, మధు గౌడ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










