Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం

రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతాళ్ళ గూడెం-వలిగొండ గ్రామాల మధ్య రైల్వే లైన్ పై గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

 

రైల్వే కీ మన్ శ్రీనివాస్ తెలిపిన సమాచారం ప్రకారం ఉదయం 9 గంటలకు పట్టాల పక్కన గుర్తుతెలియని శవం ఉన్నదని రైల్వే పోలీసులకు తెలిపారు.

 

సంఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు గుర్తుతెలియని వ్యక్తి రైల్లో నుంచి పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని నల్ల ప్యాంటు ఆరెంజ్ కలర్ షర్ట్ ధరించి సుమారు 35 నుండి 45 సంవత్సరాలు వయసు ఉన్నట్లు గుర్తించారు.

 

గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు