సింగరేణి ప్రైవేటీకరణకు వేతిరేకంగా రేపు ధర్నా
సింగరేణి ప్రైవేటీకరణకు వేతిరేకంగా రేపు ధర్నా
సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం
సత్తుపల్లి,మనసాక్షి:
సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 8వ తేదీన సింగరేణి ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ మహా ధర్నాలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రేపు కొత్తగూడెంలో జరగనున్న ధర్నాను విజయవంతంగా చేయాలనీ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం సత్తుపల్లి సింగరేణి యూనియన్ నాయకులతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.
సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం కుట్ర చేస్తూ తెలంగాణలోని సత్తుపల్లి బ్లాక్ -3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని,వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రేపు కొత్తగూడెంలో మహాధర్నాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు.









