Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే..  ఈ విధంగా చేయాలి –  ఎస్పీ ఎన్.వెంకటేశ్వుర్లు 

సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే..  ఈ విధంగా చేయాలి –
ఎస్పీ ఎన్.వెంకటేశ్వుర్లు 

నారాయణపేట, మన సాక్షి:

నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మరికల్ పోలీస్ స్టేషన్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై హరిప్రసాద్ రెడ్డిని పెండింగ్ లో ఉన్న ఫైల్స్ గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

 

కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని సూచించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పోలీసులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకమవుతు వారి సమస్యలు తెలుసుకోని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ఉండాలని, వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం అందించాలని ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందని భరోసా, భద్రత కల్పించాలని ఎస్పీ తెలిపారు.

 

పోలీస్ స్టేషన్ లాకప్ లో అనవసరంగా ఎవర్ని పెట్టరాదని నా దృష్టిలో లేకుండా లాకప్ లో ఉంటే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ ద్వారా అట్టి నెంబర్ను www.ceir.gov.in వెబ్సైట్లో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్ పట్టుకోవడం జరుగుతుందని ఈ నూతన అప్లికేషన్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

 

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారుల సమన్వయంతో కలిసి జిల్లాలోని వాహనాలకు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశంలో, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, రోడ్డు మలుపుల దగ్గర రేడియం స్టిక్కర్స్ ను త్వరలో వేయించడం జరుగుతుందని రేడియం స్టిక్కర్లు ఉండటంవల్ల అర్ధరాత్రి ఎక్కడైనా వాహనాలు ఆగిపోయిన వాటిని మిగితా వాహనదారులు వెంటనే గుర్తించడానికి అవకాశం ఉంటుందని వీటి వల్ల కొంతలో కొంత రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

 

రోడ్డు భద్రత నియమాలు సైబర్ నేరాలు, సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం వారు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఎస్పి తెలిపారు. మహిళా నేరాలను అరికట్టడానికి షి టీమ్ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని మరియు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నిర్మూలన కొరకు పెట్రోలింగ్, బిట్స్ పెంచడంతో పాటు క్రైమ్ పోలీసుల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

 

ఎస్పీ వెంబడ డిఎస్పి సత్యనారాయణ , ఎస్.ఐ.హరి ప్రసాద్ రెడ్డి, పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు