Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు

– మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్

చౌటుప్పల్, మన సాక్షి

టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పై చేసిన నిరాధారమైన, అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఈటెల రాజేందర్ వెనుకకు తీసుకోని కాంగ్రెస్ పార్టీకి, రేవంతరెడ్డికి క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రేస్ అధ్యక్షులు బోయ దేవేందర్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ స్మారక భవనంలో ఆదివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

 

కాంగ్రేస్ పార్టీని బలహీన పర్చడానికి బిజెపి, బిఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగంగా ఈటల రాజేందర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడు తున్నాడు అని అన్నారు. ఉపఎన్నికలలో బిఆర్ఎస్ దగ్గర 25కోట్లు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమండ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తూరని, రాబోయే రోజుల్లో కాంగ్రేస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావటం ఖాయం అన్నారు.

ALSO READ : Degree, Be tech: డిగ్రీ, బీటెక్ విద్యార్థుల అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.!

ఈ కార్యక్రమములో మున్సిపాలిటి అధ్యక్షులు సుర్వి నర్సింహ గౌడ్, ఎం ఏ ఖయ్యూం, నల్ల, నర్సింహ్మ, ఊదరి నర్సింహ్మ, దొనకొండ కృష్ణ, మారగొని శేఖర్, ఎర్రగోని లింగస్వామి యాదవ్, మట్టపల్లి శ్రీశైలం, ఊదరి మహేష్, మాదాని గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు