Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

వలిగొండ : సుంకిశాల- పులిగిల్ల ప్రయాణికుల ఇబ్బందులు

వలిగొండ : సుంకిశాల- పులిగిల్ల ప్రయాణికుల ఇబ్బందులు

వలిగొండ, మన సాక్షి:

వలిగొండ-సుంకిశాల- పులిగిల్ల మధ్య అధ్వానంగా మారి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తున్న బీటీ రోడ్డు కు నూతన రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య లు డిమాండ్ చేశారు. సుంకిషాల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్న సుంకిషాల, పులిగిల్ల గ్రామ ప్రజలతో పాటు అటు మోటకొండూరు, భువనగిరి మండలాలకు వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ALSO READ : సూర్యాపేట : మండుటెండలో తండ్రికి గొడుగు పట్టిన మంత్రి జగదీష్ రెడ్డి

రోడ్డు వెంట పెద్ద గుంతలు పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు రోడ్డు మంజూరు అయ్యిందని సంవత్సరం నుంచి అనేక మార్లు ప్రకటించిన రోడ్డు మాత్రం వేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రకటనలను మరిచి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మే 4 వ తేది వరకు పనులు ప్రారంభించకపోతే సుంకిషాల, పులిగిల్ల గ్రామాల ప్రజలతో పాటు సీపీఎం కార్యకర్తలను సమీకరించి రోడ్డు డ్రిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు .

ALSO READ : సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే..  ఈ విధంగా చేయాలి –  ఎస్పీ ఎన్.వెంకటేశ్వుర్లు 

ఈ కార్యక్రమంలో సీపీఎం శాఖ సహాయ కార్యదర్శి మంగ బాలయ్య, సిపిఎం నాయకులు ఎడవెల్లి రాములు,కాటేపల్లి పాండు, చెరుకు స్వామి,వేముల రాములు,కాటపల్లి వెంకటేశం,బొదాసు సోమయ్య,ఏనుగు ప్రభాకర్ రెడ్డి, గాడిపల్లి రమేష్,దొడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు